Pages

Subscribe:

ముప్పై దాటాక ఆరొగ్యానికి ఇవి అవసరం!

images 


మనిషి కొంత వయసు వచ్చాక అంటే ముప్పయి సంవత్సరాలు నిండిన తర్వాత శరీరంలో మార్పులు, ఆరోగ్యంలో మార్పులు సంబవిస్తుంటాయి. దీనిలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కవ అవ్వడం మనిషి ఊబయాకంగా మారడం. శరీరాకృతి లో మార్పులు రావడం లాంటివి వీటిని నిర్మూలించేందుకు మనం చాలా రకాలుగా కష్టపడుతుంటాం. పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము.
ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.కొలెస్ట్రాల్ తగ్గచించుకునేందుకు మనం తీసుకోవాల్సిన చర్యలు

 images (8) 


images (8)
1. ఆపిల్ పండు రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.
2. బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి
3. బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది.
4. ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్విర్యం చేస్తుంది. మధుమేహగ్రస్తులకు ద్రాక్ష నిషిద్ధం.
download (8)
5. తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి. జమలోని విటమిన్ సి భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.
6. పుట్టగొడుగులు: కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో మాష్ రూమ్స్ లోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగాపడతాయి.
7. బాదం పప్పు తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రల్ ను తగ్గిస్తుంది. దీనిలోని ఒలియిక్ ఆమ్లం, గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో అన్ సచురేటేడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి.
8. ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి. సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తం నుండీ కొలెస్ట్రాలును విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుల్లలో విటమిన్ b3, b6, E , ఉన్నాయి.
9.వంకాయ: అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కలిగిన వంగ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి.

0 comments:

Post a Comment