Pages

Subscribe:

ఒత్తిడిని దూరం చేసే ఆహారం

download 
 మనం అనేక రకాలుగా ఒత్తిడికి గురవుతుంటాము. ఒత్తిడి తగ్గించుకోవ టానికి యోగా, ధ్యానం ఉపయోగపడతాయని చాలా మంది అంటారు. అయితే ఆహారంతోనూ ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
విటమిన్‌ ‘సి': ఈ విటమిన్‌లో ఒత్తిడిని తగ్గించే గుణం వుంటుంది. నారింజ, అనాస, టమాటా, జామలో ఇది వుంటుంది. మానసికంగా చిరాగ్గా, విసుగ్గా వున్నప్పుడు వీటిని తింటే మంచి ఫలితం వుంటుంది.
అరటిపండు: ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో అరటిపండు ఒకటి. ఓ చిన్న పండును తింటే సరిపోతుంది. అందులో తక్కువ క్యాలరీలు లభించడమే కాదు, శరీరానికి అవసరమైన చక్కెర ఆ చిన్న పండు ద్వారా అందుతుంది. అంతేకాదు మెదడుకు మేలు చేసే సెరటోనిన్‌ అనే రసాయ నం ఉత్పన్నమ వుతుంది. దీనివల్ల ఉత్సాహంగా ఉండటం సాధ్య మవుతుంది. ఒత్తిడి కూడా నియంత్రణలోకి వచ్చేస్తుంది.
నట్స్‌: వీటిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసికంగానూ దృఢంగా మారతారు. ఉద్యోగినులూ, విద్యార్థినులూ వెంట ఎప్పుడూ డ్రై ఫూట్స్‌ వుంచుకోవడం అలవాటుగా మార్చుకుంటే మంచిది. ఒత్తిడిగా అనిపించినప్పుడు అవి తింటే ఒత్తిడి దూరమవుతుంది.
ఓట్స్‌: ఇవి మనకు కావల్సినప్పుడు అందుకబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఓట్స్‌తో చేసిన బిస్కెట్లు, చిక్కీలు తినడం మంచిది. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరం కూడా వీటిని త్వరగా గ్రహిస్తుంది. ఓట్స్‌ తేలికపాటి ఆహారం కావడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలూ రావు.
చేప నూనె: ఎక్కువగా ఒత్తిడికి గురై, టెన్షన్లు ఎదుర్కొనేవాళ్లు…వంటకు మామూలు నూనెకు బదులు, చేప నూనెను ఎంచుకోవడం మంచిది. దీనిలో ఉండే విటమిన్‌ ఒత్తిడిని దూరం చేసే హారోన్లను శరీరంలోకి విడుదల చేస్తుంది. విద్యార్థులు దీనికి ఎంత ప్రాధాన్యమిస్తే అంత మంచిది.

0 comments:

Post a Comment