Pages

Subscribe:
Showing posts with label swine flu. Show all posts
Showing posts with label swine flu. Show all posts

స్వైన్‌ ఫ్లూ ఎదుర్కోండిలా!

 

స్వైన్‌ ఫ్లూ.. స్వైన్‌ ఫ్లూ.. ప్రస్తుతం ఎవరినోట విన్నా ఇదే మాట. ఎవరిని కదిపినా ఇదే భయం. అయితే.. స్వైన్‌ ఫ్లూ గురించి అంత భయపడాల్సిన పని లేదు. రోగనిరోధక శక్తి సమర్థంగా పనిచేస్తుంటే స్వైన్‌ సహా ఎలాంటి ఫ్లూనయినా సమర్థంగా ఎదుర్కోగలదు. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడే సమస్య. ఈ నేపథ్యంలో.. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కొన్ని చిట్కాలను ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
 రోజూ ఉదయాన్నే నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగండి. తులసిమొక్కకు రోగనిరోధకశక్తిని పెంచే గుణంతోపాటు.. ఇందులోని ఔషధగుణాలు గొంతును, ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతాయి.
జూ తిప్పతీగ.. ఇది చాలా ప్రాంతాల్లో విరివిగా దొరుకుతుంది. దొరికితే ఒక అడుగు పొడుగున్న తిప్పతీగను తీసుకుని (లేదా ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో తిప్పతీగ పొడి దొరికే అవకాశం ఉంది. దాన్నైనా వాడుకోవచ్చు), దాంతోపాటు ఐదారు తులసి ఆకులను నీళ్లల్లో వేసి 20 నిమిషాల పాటు మరిగించండి. రుచికోసం ఆ కషాయానికి తగుమోతాదులో నల్లమిరియాలు, సైంధవలవణం, రాతి ఉప్పు, పటిక బెల్లం వంటివి కలుపుకొని ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా తాగండి. రోగ నిరోధక వ్యవస్థను అద్భుతంగా పనిచేయించే శక్తి ఈ కషాయానికి ఉంది.
 పచ్చివెల్లుల్లిని తినగలిగినవారు రోజూ ఉదయాన్నే రెండు రెబ్బల్ని గోరువెచ్చటి నీటితో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 గోరువెచ్చటి పాలల్లో పసుపు కలుపుకొని తాగితే చాలా మంచిది.
 అలోవీరా ఆకుల నుంచి తీసిన రసాన్ని ఒక టీస్పూన్‌ మేర నీళ్లతో కలిపి తీసుకుంటే చర్మానికి మంచిది. కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటన్నిటితో పాటు.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జూ నిమ్మజాతికి చెందిన పండ్లను.. సి విటమిన్‌ అధికంగా ఉండే పండ్లరసాలను అధికంగా తీసుకుంటే మంచిది.
 నిత్యవ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రాణాయామం, యోగా వంటివి కూడా.. నోరు, గొంతు, ఊపిరితిత్తులపై దాడి చేసే వ్యాధులను నిరోధించే శక్తిని శరీరానికి ప్రసాదిస్తాయి.
..ఈ చిట్కాలు ఫ్లూ రాకుండా అడ్డుకోవడానికి తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు మాత్రమే. ఫ్లూ లక్షణాలతో బాధపడేవారు తప్పనిసరిగా వైద్యుల సిఫారసుతో చికిత్స తీసుకోవాల్సిందే.