Pages

Subscribe:

లావు అవుతారని తినడం లేదా


సన్నగా కనిపించాలని తరచూ అన్నం తినడం మానేస్తున్నారా... ఆకలిని చంపుకుంటున్నారా? ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. రోజూ అన్నం తినకుండా ఉండడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు. తిండి తినకపోతే సన్నబడడం మాట అలా వుంచితే పొట్ట బాగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒహియో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తినేవారిలో, అలాగే పూర్తిగా పస్తులుండేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివారిలో కాలేయం ఇన్సులిన్‌కు స్పందించడం మానేస్తుందిట. గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తూ పోతుందిట. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. అలా చేరిన ఎక్స్‌ట్రా సుగరు ఫ్యాట్‌ అయి రక్తంలో కేంద్రీకృతమవుతుంది. చివరకు అది టైప్‌-2 డయాబెటి్‌సకు దారితీస్తుంది. డయాబెటిస్‌ వచ్చిందంటే గుండెజబ్బుల ప్రమాదం పొంచి ఉంటుంది. ఫుడ్‌ తినకుండా ఎగ్గొట్టడం వల్ల శరీరంలో ఫ్యాట్‌ తగ్గడం కన్నా ఎక్కువయ్యే అవకాశాలే అధికమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అన్నం తినడానికి రెండు మూడు గంటల ముందు ఆకలి వేస్తే హెల్దీ స్నాక్‌ తీసుకుంటే మంచిదంటున్నారు. అలాంటి సమయాల్లో ఐదారు బాదంపప్పులు తింటే మంచిది. లేదా ఫ్రూట్‌ సలాడ్‌ లేదా వెజిటబుల్‌ సలాడ్‌ తిన్నా శరీరానికి మంచిదే. అలాగే పెరుగు లేదా ఫ్రూట్‌ స్మూతీస్‌ కూడా మధ్యమధ్యలో తినొచ్చు. అవి కాకపోతే ఇంట్లో తయారుచేసుకున్న వెజిటబుల్‌ లేదా చికెన్‌ సూప్‌ తాగినా ఒంటికి మంచిదేనని పోషకాహార నిపుణులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

0 comments:

Post a Comment