Pages

Subscribe:

banana


అరటిపండు శరీరానికి త్వరగా శక్తినిస్తుంది. అరటిపండు చేతిలో పడ్డాక వెంటనే అరటితొక్కని తీసి వెంటనే చెత్తబుట్టలో పడేసి అరటిపండు తింటాం. ఆఫా్ట్రల్‌ అరటి తొక్కే కదా అని తక్కువ అంచనా మాత్రం వేయకండి. అవును మరి, ఆ అరటి తొక్కతో ముడిపడిన అంశాలు అమోఘం.
మీకు ఓ విషయం తెలుసా? అరటితొక్కలో యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈసారి మీరు అరటి పండ్లు తినేటప్పుడు వాటి తొక్కల్ని నిర్లక్ష్యంగా రోడ్డు పైనా, ఇంట్లోని  చెత్తబుట్టలోనో విసిరిపారేయకుండా, వాటిని ఇలా ఉపయోగించి చూడండి.
ఎరువుగా ఉపయోగపడుతుంది
మట్టిలో అరటితొక్కలు వేస్తే కంపోస్టు ఎరువుగా ఉపయోగపడుతుంది. మీ పెరట్లోని మొక్కలకు ఆ సహజ ఎరువు వాడితే అరటితొక్కలోని పోషకపదార్థాల వలన మొక్కలు త్వరగా వృద్ధి చెందుతాయి. దీంతో పాటు మీ ఇంటి ప్రాంగణంలోని మొక్కలపై మరో ప్రయోగం చేయండి. ఒక జాడిలో నీళ్ళు తీసుకుని అందులో నాలుగైదు అరటితొక్కల్ని నానబెట్టాలి. తర్వాత ఆ జాడికి మరో ఐదు జాడీల మంచినీళ్ళు కలిపి మొక్కలపై చల్లితే రసాయనిక ఎరువులాగా కూడా పనిచేస్తుంది.
ఆహారంగా తీసుకోవచ్చు
అరటిపండును నీళ్లతో శుద్ధిచేసి తర్వాత తొక్కతో సహా తినే అలవాటు ఉంటుంది కొందరికి. ఇది మంచిదే. అలా కుదరనపుడు అరటితొక్కని పదినిమిషాల పాటు ఉడకబెట్టి , పండ్లతో కలిపి జ్యూస్‌ చేయటం లేదా పండ్లతో కలిపి తినటం మంచిది.
చక్కని ఔషధం
శరీరంపైన కమిలిన గాయాలనీ ఈ తొక్క మాన్పుతుంది. గాయమున్నచోట అరటితొక్కతో రుద్దటం కానీ, లేకుంటే తొక్కని కమిలిన చోట రాత్రంతా కట్టిఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
తళుకును అందిస్తుంది
అరటి తొక్కతో లెదర్‌ షూలని బ్రష్‌ చేస్తే మంచి షైనింగ్‌ వస్తుంది. అంతేనా సిల్వర్‌ వస్తువుల్ని నీళ్లతో కడిగేటపుడు అరటితొక్కను ఉపయోగించి చూడండి, చక్కని ఫలితం వస్తుంది.
చర్మ సమస్యల నివారిణి
అరటి తొక్క చర్మ వ్యాధులని నయం చేస్తుంది. పులిపెరలు ఉన్న వాళ్లు అరటితొక్కని వాటిపై రుద్దితే ఊహించని విధంగా ఫలితాన్ని పొందవచ్చు. ఇక చేతులు, కాళ్ళపై లేదా శరీరంపై ఎక్కడైనా చర్మంపై చెక్క కొయ్యలు, ముల్లు లాంటివి గాయపరిస్తే అక్కడ అరటితొక్కలోపలి భాగంతో రుద్దితే ఆ సమస్య త్వరగా నివారించ వచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి చిన్నపాటి చర్మ సమస్యలకి అరటితొక్కే ఉపయుక్తం అంటున్నారు వైద్యులు.
కీటక నాశిని
అరటి తొక్కలు నానబెట్టిన నీళ్ళను ఇంటి ఆవరణలోని పూలదోటలో, లేకుంటే ఇంటిముందు పచ్చిక, మొక్కలపై చల్లితే మిడతలు, పురుగుల్లాంటివి రావు. రకరకాల కీటకాలు ఇబ్బందులకి గురిచేయవు.

0 comments:

Post a Comment