Pages

Subscribe:

migraine


 మైగ్రేన్ తలనొప్పి (పార్శ్వపు తలనొప్పి) తగ్గడానికి చిట్కాలు
1) ఈ మైగ్రేన్ తలనొప్పి , తల కుడి భాగం లేదా ఎడమ భాగంలో మొదలై కళ్ళ వరకు కేంద్రీకృతమై ఉంటుంది. తలలో ఒక భాగం మాత్రమే నొప్పి ఉండి , కన్ను మొత్తం లాగుతుంది. తలను కిందికి వంచినప్పుడు నొప్పి పెరుగుతుంది.

2) ఈ మైగ్రేన్ తలనొప్పి రావడానికి ప్రధానకారణాలు నిద్రలేమి , పోషకాహరలోపం , శరీరంలో అధికవేడి , మానసికఆందోళనలు , ఎక్కువగా ఉపవాసాలు ఉండడం, సమయానికి ఆహరం తీసుకోకపోవడం , రోజులో తగినంత నీరు తీసుకోకపోవడం.

n మైగ్రేన్ ఉపశమనానికి చిట్కాలు

1) కొంచెం వామ్ము తీసుకొని , దోరగా వేయించి ఒక చిన్న బట్టలో మూటలా కట్టి , కాసేపు ముక్కుతో పీల్చాలి. ఉపశమనం లభిస్తుంది.

2) కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి , తల మొత్తం మసాజ్ చేయాలి.

3) క్యారట్ , బీట్రూట్ కలగలిపిన జ్యూస్ తీసుకోవాలి.

4) ధనియాలను మెత్తగా నూరి ఆ ప్రాంతంలో పట్టులా వేయాలి.

5) పైన తెలిపిన చిట్కాలను చేస్తూ , క్రింది ఆహారనియమాలు పాటించండి.

  ఆహార నియమాలు

1) రోజులో 10 గ్లాసుల నీటిని త్రాగాలి.

2) పోషకాలతో కూడిన ఆహరం తీసుకోవాలి. క్యారట్ , బీట్రూట్ , పాలకూర , మెంతికూర , సోయాచిక్కుళ్ళు , పల్లీలు , నువ్వులు , పాలు , కీర దోస , బీరకాయ , బెండకాయ , పెరుగు , అరటిపండు , జామపండు , బొప్పాయి వంటివాటిని తరచుగా తీసుకోవాలి.

3) మానసికఆందోళన లేకుండా చూసుకోవాలి. కనీసం రాత్రివేళ 7 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

4) డాక్టర్ సలహాలేకుండా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.

5) పైన తెలిపిన విధంగా జీవనశైలిలో మార్పులు చేసుకొంటే మైగ్రేన్ బాధలు నుండి ఉపశమనం లభిస్తుంది

0 comments:

Post a Comment