Pages

Subscribe:

బరువు తగ్గాలంటే ఏం చేయాలి ?


1) బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేయడం వల్ల సన్నబడడం సంగతి అటుంచి ఆరోగ్యపరమైన కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని కన్నా వైద్యులు సూచిస్తున్న ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి.

2) ప్రతిరోజూ ఉదయాన్నె వెన్న తీసిన పాలు ఓ గ్లాసుడు తాగితే, శరీరంలోకి కొత్త శక్తి వచ్చి రోజంతా ఉత్సాహంగా ఉంటారు

3) బయటకు వెళ్లినపుడు ఒక లీటరు మంచినీటి బాటిల్ ఎప్పుడూ ఉంచుకోవాలి. రోజూ 20 నిమిషాల నడక 96 క్యాలరీలను ఖర్చు చేస్తుంది. నడక పూర్తయిన తర్వాత కడుపునిండా నీళ్లను తాగితే నీరసంగా ఉండదు.

4) తినడం మానేసి డైటింగ్ చేసే కన్నా చక్కని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వెన్నతీసిన పాలు, క్యారెట్, బీట్‌రూట్, కీరా లాంటి పచ్చి కూరగాయలు, కూరగాయలతో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్‌లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

5) కాఫీ తాగాలని అనిపిస్తే పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగండి. బ్లాక్ కాఫీలో 10 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వు పదార్థాలేవీ ఉండవు. అదే పాలతో కలిపిన కాఫీ తాగితే 210 క్యాలరీలు, 11 గ్రాముల కొవ్వు శరీరంలో చేరతుంది.

6) భోజనం చేసేటప్పుడు ఒంటరిగానే తినడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా కన్నా ఫ్రెండ్స్‌తో కలిసి భోంచేస్తే ఎక్కువ తినేస్తారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

7) పండ్ల రసాలను నేరుగా తాగకూడదు. ఒక లీటరు ఆరెంజ్ జ్యూస్‌లో 360 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల సగం గ్లాసులో ఫ్రూట్‌జ్యూస్ తీసుకుని అందులో సగం నీళ్లు కలిపి తాగాలి.

8) భోజనం చేసే సమయంలో కొవ్వు అధికంగా ఉండే వంటకాలను ఆఖరున తినాలి. ముందు పచ్చి కూరగాయల ముక్కలు, ఆ తర్వాత చపాతీలు లేదా కొద్దిగా అన్నం తీసుకుని చివరిలో మాంసపదార్థాలను తినాలి.

0 comments:

Post a Comment