Pages

Subscribe:

‘గుండెల్లో మంట’కు చెక్‌ చెప్పేద్దాం!

 
ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మూలంగా తరచుగా ఎసిడిటీ బారిన పడుతుంటారు. ఇలాంటప్పుడు చేతికందిన యాంటాసిడ్‌ను వాడే బదులు శాశ్వత ఉపశమనాన్ని అందించే కొన్ని చిట్కాలు పాటించాలి. అలాగే జీవనశైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి.
 అధిక బరువు వల్ల కూడా గుండెల్లో మంట రావొచ్చు. శరీర బరువులో కనీసం 10 శాతం కొవ్వును తగ్గించినా యాసిడ్‌ రిఫ్లెక్స్‌ లక్షణాలు తగ్గుముఖం పడతాయని పరిశోధనల్లో తేలింది.
 ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినటం మానేయాలి. నోరూరించే ఫాస్ట్‌ఫుడ్స్‌ మీద ఆశను చంపుకుంటే ఎసిడిటీ దానంతటదే తగ్గుతుంది.
 పచ్చి బాదం పప్పులను తినాలి. ఆల్కలైన్‌ను తయారుచేసే బాదం శరీరపు పిహెచ్‌ బ్యాలెన్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
 ప్రాసెస్‌ చేయని కలబంద రసం తాగాలి.
 పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఉదయం అల్పాహారానికి 20 నుంచి 30 నిమిషాల ముందు ఈ నీళ్లు తాగటం వల్ల శరీరం సహజసిద్ధంగా యాసిడ్‌ లెవెల్స్‌ను సమతూకంలో ఉంచుతుంది.
 అర కప్పులో రెండు టీస్పూన్ల సోడా ఉప్పు కలిపి తాగినా ఉపశమనం లభిస్తుంది.
 ప్రతిరోజూ ఒకటి లేదా రెండు స్పూన్ల యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తీసుకోవాలి. లెమన్‌ టీ లేదా హనీ టీలతో కలిపి తీసుకోవచ్చు.
 కడుపునిండా భోంచేసినట్టు అనిపిస్తే వెంటనే రెండు యాపిల్స్‌ తినాలి.
 చమొమైల్‌, మింట్‌ లేదా మెంతి టీ తీసుకున్నా ఫలితం ఉంటుంది.
 భోజనం తర్వాత బబుల్‌గమ్‌ నమిలినా నోట్లో లాలాజలం బాగా ఊరి ఈసోఫేగ్‌సలోని యాసిడ్‌ లెవెల్స్‌ తగ్గుతాయి.
 ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. జీర్ణాశయం ఉండే కుడివైపుకి తిరిగి నిద్రపోతే ఒత్తిడి పెరిగి యాసిడ్‌ గొంతులోకి ఎగదన్నే అవకాశం ఎక్కువ.

0 comments:

Post a Comment