Pages

Subscribe:

చుండ్రు ఇక కనిపించదు

 
 

 
చికాకు తెప్పించే సమస్య చుండ్రు. రోజూ షాంపూ పెట్టి స్నానం చేసినా కొన్నిసార్లు చుండ్రు వదలదు. చుండ్రు రావడానికి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రధాన కారణమైనా, ఇతర కారణాలు కూడా ఉంటాయి. పొల్యూషన్‌, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, నరాల జబ్బులు, శుభ్రత పాటించకపోవడం వంటివి కారణమవుతాయి. అయితే మెడికేటెడ్‌ షాంపూల అవసరం లేకుండానే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా చుండ్రు దూరం చేసుకోవచ్చు. అలాంటి చిట్కాలు నాలుగు మీకోసం...
జి వారంలో రెండు రోజులు తలకు ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేయండి. ఆలివ్‌ ఆయిల్‌లో సహజసిద్ధంగా చుండ్రును తొలగించే గుణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌ పట్టించి తలచుట్టూ టవల్‌ లేక స్కార్ఫ్‌ కట్టుకుని పడుకుంటే ఆయిల్‌ బాగా అబ్జార్బ్‌ అవుతుంది.
జి నిమ్మ ఆకులను అరగంట పాటు నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ ఆకులను పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. నలభైనిమిషాల పాటు అలా వదిలేసి తరువాత నీటితో కడుక్కోవాలి.
జి అలోవెరాలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. ఇవి చుండ్రును సమర్ధవంతంగా తొలగిస్తాయి. తలకు అలోవెరా జెల్‌ను పట్టించి నలభై నిమిషాల తరువాత కడుక్కుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది.
జి మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌ మాదిరిగా చేసుకుని తలకు పట్టించాలి. అరగంటపాటు అలా వదిలేసి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి నెల పాటు చేయాలి. చుండ్రు ఛాయలు కనిపించకుండా పోతాయి

0 comments:

Post a Comment