Pages

Subscribe:

summer diet rulz


ఫిబ్రవరి మాసం చివర్లోకి వచ్చామంటే ఇక వేసవికాలం స్వాగతం చెప్పినట్లే. సమ్మర్‌లో ఎక్కువగా అలసిపోవటం, డీ హైడ్రేషన్‌ సమస్య వస్తుంది. డైట్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో వచ్చే సమస్యల్ని సులువుగా అధిగమించవచ్చు.
ప్రకృతిలోని పంచభూతమైన నీరు ప్రాధాన్యత శరీరానికి అవసరమని గ్రహించాలి. వేసవికాలంలో శరీరంలో నీటి శాతం ఎక్కువ ఉండేట్లు చూసుకోవాలి. నీళ్ళను ఎక్కువగా తాగటం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. దీంతోపాటు లవణ శాతాన్ని సమన్యయ పరుస్తుంది. దీనివల్ల డీ హైడ్రేషన్‌ సమస్యలు ఉత్పన్నం కావు. అందుకే వేసవిలో నీటిని బాగా తీసుకోవాలి.
వేసవిలో కెఫీన్‌ తీసుకోవటం మానేయాలి. కాఫీలోకి ఎక్కువగా చక్కెర వాడతారు. ఇది శరీరానికి హానికరం అని గ్రహించాలి. చాలా మంది శీతలపానియాలు తాగితే దప్పిక తీరుతుంది అన్నట్లు ప్రవర్తిన్నారు. ఇది మంచిదికాదు. ఇలాంటి వాటిలోని ఫాస్పరిక్‌ ఆమ్లం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు.
వేసవిలో ఈత కొట్టడం శరీరానికి ఉపయుక్తమైన ఎక్సర్‌సైజ్‌ అని గ్రహించాలి.
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి. మాంసాహారం ఎక్కువగా ప్రిఫెర్‌ చేయకపోవటం మంచిది. హైపర్‌ టెన్షన్‌, ఒబెసిటీ సమస్యలు రాకుండా ఆయిల్‌ ఫుడ్‌ని అవాయిడ్‌ చేయాలి.
మీది హీట్‌ బాడీ అయితే ముల్లంగి, ఆనియన్స్‌, గార్లిక్‌ తినటం తగ్గించండి. పైనాపిల్‌, గ్రేప్‌ జ్యూస్‌ని తినకపోవటం మంచిది. ఇక వేసవిలో వచ్చే సీజనల్‌ ఫ్రూట్స్‌ మామిడి కూడా శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది. అందుకే అధికంగా మామిడి పండ్ల తినటం మంచిది కాదు. డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువగా తీసుకున్నా శరీరంలోని టెంపరేచర్‌ పెరుగుతుంది.
ఫ్రైడ్‌ రైస్‌తో మిగతా ఫ్రైడ్‌ ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోకూడదు. తీపి పదార్థాలు వేడిని పెంచుతాయి. అందుకే వీలైనంత వరకూ తగ్గించాలి.

0 comments:

Post a Comment