కళ్ల కింద నలుపు వదలాలంటే


ముఖం
ఎంత కాంతివంతంగా ఉన్నా కళ్ల కింద నల్లని వలయాలుంటే కళావిహీనంగా
కనిపిస్తాం. కళ్ల కింది నలుపుకు పోషకాహారలోపం, నిద్రలేమిలాంటి కారణాలు
అనేకం. అందుకే ఈ సమస్యలను పరిష్కరించటంతోపాటు నలుపును తగ్గించే చిట్కాలు
కూడా పాటించాలి.
చర్మం మీది మిగతా చర్మంతో
పోలిస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం ఎంతో పలుచగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి
ఆ ప్రదేశంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మధ్యవయస్కులతోపాటు ఈమధ్య కాలంలో
యువతుల్లో కూడా కళ్ల కింద నల్లని వలయాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా పళ్లు,
కూరగాయలు, పెరుగు, పనీర్, పాలు, చిక్కుళ్లు మొదలైన పదార్థాలను తీసకుంటూ
రోజుకి కనీసం 8 గంటలపాటు నిద్రపోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి.
ఒత్తిడి, ఆందోళనలను తగ్గించే శ్వాశ వ్యాయామాలు కూడా చేస్తే ఫలితం ఉంటుంది. ఈ
జాగ్రత్తలు పాటిస్తూ తేలికగా ఇంట్లోనే తయారుచేసుకోగల ఈ సౌందర్య చికిత్సలను
అనుసరించాలి.
జు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు దోస రసాన్ని కళ్ల కింద అప్లై చేసి 15 నిమిషాలాగి కడిగేసుకోవాలి.
జు సమ పాళ్లలో దోస, బంగాళాదుంప రసాలను కలిపి అప్లై చేసి 15 నిమిషాలాగి కడిగేసుకుంటే కళ్ల కింద నలుపుతోపాటు వాపు కూడా తగ్గుతుంది.
జు టమేటా రసం పూసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
జు చల్లని పాలు లేదా నీళ్లలో ముంచిన దూదిని కళ్ల మీద కొద్ది నిమిషాలపాటు ఉంచుకోవాలి.
జు చల్లని టీ బ్యాగ్స్‌ను మూసిన కనురెప్పలపై ఉంచుకుంటే కళ్లు సేదతీరి నలుపు అదుపులోకొస్తుంది.
జు బాదం
పేస్ట్‌కు కొద్దిగా పాలు కలిపి కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఇలా రాత్రంతా
ఉంచుకుని ఉదయం కడిగేసుకుంటే కళ్ల కింది చర్మం తేటగా తయారవుతుంది.
జు పుదీనా ఆకుల్ని నలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.
జు ఆరెంజ్
జ్యూస్, గ్లిజరిన్‌లను కలిపి కళ్ల చుట్టూ పూసుకుని 20 నిమిషాల తర్వాత
కడిగేసుకోవాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే కళ్ల చుట్టూ ఉండే చర్మం తేటగా
తయారవుతుంది.
ఐ కేర్
కళ్ల చుట్టూ ఉండే చర్మం సున్నితమైనది కాబట్టి ఆ ప్రదేశంలో అప్లై చేసే మేకప్ మొదలు మసాజ్ వరకూ ఎంతో మృదువుగా వ్యవహరించాలి.
జు మేకప్ తీసేటప్పుడు మృదువైన దూదిని, మేలురకం క్లీన్సర్‌ను ఉపయోగించాలి.
జు సున్నితంగా తాకుతూ నెమ్మదిగా మేకప్ తొలగించాలి.
జు అలాగే కళ్ల చుట్టూ క్రీమ్ అప్లై చేసేటప్పుడు కూడా సున్నితంగానే వ్యవహరించాలి.
జు కళ్ల చుట్టూ ఏదైనా ఫార్ములేటెడ్ క్రీమ్ అప్లై చేసి నీళ్లతో తడిపిన దూదితోనే సున్నితంగా తొలగించాలి.
జు బాదం కలిగిన అండర్ ఐక్రీమ్ ప్రతి రోజూ నిద్రకు ముందు అప్లై చేయాలి.
జు ఫేస్ మాస్క్ వేసుకునేటప్పుడు కంటి చుట్టూ ఉండే చర్మానికి తగలనివ్వకూడదు.
జు కళ్లను ముందు గోరువెచ్చని నీళ్లతో తర్వాత చల్లని నీళ్లతో కడిగితే రక్త ప్రసరన మెరుగై కళ్లు తేజోవంతంగా ఉంటాయి.
0 comments:
Post a Comment