Pages

Subscribe:

winter fruit for active



శీతాకాలం చురుకైన ఆహారం

చురుకులేని వాతావరణంలో ఎంత ప్రయత్నించినా ఉత్సాహం కలగదు. మనసూ, శరీరం కూడా మందకొడిగానే ఉంటాయి. దీన్నే 'సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్' అంటారు. ఈ సమస్య తగ్గాలంటే ఆహారంపై దృష్టి పెట్టాలి.

'డి' విటమిన్‌తో ఈ సమస్య చాలావరకూ తగ్గుముఖం పడుతుంది. ఈ కాలంలో ఎండ నుంచి తగినంత 'డి' విటమిన్ లభించదు. అందుకే చేపల నుంచి పొందే ప్రయత్నం చేయాలి. చేపలు తినడం వల్ల మెదడు నుంచి సెరటోనిన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనసుని హుషారుగా ఉంచుతుంది. ఈ కాలంలో గుడ్లని ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లోని ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సహజమైన ఉత్సాహ కారకాలుగా పనిచేస్తాయి. కోడిగుడ్లలోని ఫాస్పోలిపిడ్స్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

ఎక్కడ చూసినా కమలాలు కనువిందుగా కనిపిస్తున్నాయి కదా! ఆలస్యం ఎందుకు తినేయండి.

కమలాల్లో విటమిన్ 'సి' మాత్రమే కాదు... మెదడుని ఉత్తేజితం చేసే ఫొలేట్లు దానిలో ఎక్కువగా ఉంటాయి. బాదం గింజలూ, వాల్‌నట్లూ, వేరుసెనగా, జీడిపప్పూ కొద్దిగా తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఎందుకంటే వాటిల్లోని సెలీనియమ్ నిరాశను తగ్గించి, మానసికోత్సాహం కలిగేలా చూస్తుంది.

0 comments:

Post a Comment