
ద్రాక్షపళ్ళు - ఆరోగ్య ప్రయోజనాలు
1) ద్రాక్షపళ్ళు లో విటమిన్ A , C , K , B కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇంకా కేరోటిన్స్, మినరల్స్ కాపర్ , ఐరన్ , మాంగనీస్ ఉంటాయి. వీటిలో పైటో కెమికల్ కాంపౌండ్స్ , యాంటి - ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువ మరియు కొలెస్ట్రాల్ ఉండదు.
2) ద్రాక్షపళ్ళు కాన్సర్ కారకాల పైన దాడి చేసి , కోలన్ కాన్సర్ , ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా చేస్తాయి. గుండె జబ్బులు , నరాల బలహీనత , ఎల్జిమేర్ , రాకుండా నియంత్రిస్తాయి.
3) వైరస్ , ఫంగస్ వల్ల వచ్చే ఇన్పెక్షన్ ను తగ్గిస్తాయి. అంతే కాకుండా గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరిచి స్ట్రోక్ రాకుండా కాపాడుతాయి.
4) బీపి ని తగ్గించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. తొందరగా ఏజింగ్ రాకుండా అంటే , ముఖం పై ముడతలు , మచ్చలు తగ్గేలా చేస్తాయి.
5) బరువు తగ్గాలి అనుకొనే వారికీ మంచి ప్రయోజనకారి , ఆహారానికి ముందు సుమారు 100 గ్రాముల ద్రాక్షపళ్ళు తినడం వల్ల ఆహరం తక్కువ తీసుకొంటారు.
6) మద్యపానం మానేయాలి అనుకొనే వారు , మందు త్రాగాలి అనిపించినప్పుడల్లా ఒక గ్లాస్ ద్రాక్షపళ్ళు జ్యూస్ తీసుకొంటే , కొంతకాలానికి మద్యపానం అలవాటు మానిపోతుంది.
7) ద్రాక్షపళ్ళు లో ఉండే విటమిన్స్ శరీరానికి అందడంవల్ల కంటి సమస్యలు , జుట్టురాలే సమస్య , మలబద్దకం , నీరసం దూరం అవుతాయి.
8) ఇన్ని ఆరోగ్య ప్రయోజనలున్న ద్రాక్షపళ్ళు ను ప్రతి రోజు ఆహరంలో భాగం చేసుకోవాలి.
0 comments:
Post a Comment